Thursday, 17 October 2013

ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సుతునకిన్డు నిలువ అర్హత లేదందువ?


దాన వీర సూర కర్ణ లోని నందమూరి తారక రామారావు గారు చెప్పిన ఈ డైలాగ్ని మీకోసం తెలుగు లో....



సుయోధనుడు: ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సుతునకిన్డు నిలువ అర్హత లేదందువ? ఎంతమాట! ఎంతమాట!! ఇది క్షాత్ర పరీక్షయే గానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు ఇది కుల పరీక్షే యందువ, నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సమ్భవమెట్టిది, మట్టికుండలో పుట్టితివి కదా నీది ఏ కులమో? ఇంత ఏల? అస్మత్పితామహుదు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాన్థనవుడు శివ సముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా? ఈయనదే కులమో? నాతొ చెప్పిన్తువేమయ్యా? మా వంశమునకు మూలపురుషుడైన వశిశ్ఠుడు దేవ వేశ్య యగు ఊర్వసి పుత్రుడు కాడా? ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చందలంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్య గంది యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాన్ద్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అమ్బాలికతొ మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర, బీజ ప్రాధాన్యములతొ సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థ వాదమెందులకు?


భీష్మడు: నాయన, సుయోధన!! ఏరులా పారు ఆ బ్రహ్మర్షుల జననములు మనము విచారింకాదగినవి కావు! ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరు క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు.


సుయోధనుడు: ఓహొ, రాచరికమా అర్హతను నిర్ణయించునది? అయిన, మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిపుడే ఈతనిని మోర్తాభిశిక్తుణ్ణి గావించుచున్నాను. సోదరా దుశ్శాసన! అనర్ఘ నవరత్న ప్రశస్త కిరీటమును వేగముగ తెమ్ము, మామా గంధర సార్వభౌమ! సురుచిర-మణిమయ-మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము, పరిజనులారా! పుణ్య-భాఘిరథీ నదీ తొయములనన్దుకొనుడు, కళ్యాణభద్రులారా! మంగళ తూర్యరావాములు సుస్వరముగా మ్రోగనిండు వన్దిమాగధులారా కర్ణ మహారాజుకు కైవారమును కావిమ్పుడు, పుణ్యాంగనలారా! ఈ రాధసుతునకు ఫాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన్మసుకృత-ప్రదీపాజ-సులబ్ద సహజ-కవకాకస్య-వైఢూర్య-ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విజాలార్పుడు. నేనీ సకల మహాజన సమక్షమున, పండిత పరిశాన్మధ్యమున సదా, సర్వదా, సతత సహస్రథా ఈ కుల కళంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షలన గావించెదను. Any doubts

No comments:

Post a Comment